08-09-2025 10:03:13 PM
తూప్రాన్,(విజయ క్రాంతి): హైదరాబాద్ రవీంద్రభారతి ఆడిటోరియం విద్యా భ్యాసానికి అంకితమైన వేదికగా మారింది. లయన్స్ క్లబ్ ఇంటర్ నేషనల్ 320-డి ఆధ్వర్యంలో "దిల్ సే గురు వందనం" పేరుతో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీమతి ధవళ ధనలక్ష్మి ని రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సన్మానించడం విశేషం. విద్యారంగంలో విశిష్ట సేవలందించిన ధనలక్ష్మి ప్రతిభకు ఈ గుర్తింపు దక్కింది. ఈ స్పందనకు పురస్కారం అందుకున్న శ్రీమతి ధనలక్ష్మి భావోద్వేగంతో మాట్లాడుతూ ఈ గౌరవం నాకు లభించడం పాఠశాల, నా విద్యార్థులు, సహచర అధ్యాపకులకు లభించిన గౌరవమే. విద్యార్థుల భవిష్యత్తు కోసం మరింత అంకితభావంతో కృషి చేస్తాను. ఉపాధ్యాయ వృత్తి ఒక పవిత్రమైన బాధ్యత. ఈ గుర్తింపు నా కృషిని రెట్టింపు చేస్తుంది అని అన్నారు. తనకు ఇంతటి ఘనత ప్రతిభ రావడానికి సహకరించిన తూప్రాన్ లయన్స్ క్లబ్ అధ్యక్ష