calender_icon.png 25 January, 2026 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాలి జనార్దన్‌రెడ్డి మోడల్ హౌస్ దహనం

25-01-2026 12:03:24 AM

  1. బళ్లారిలో ఘటన.. రంగంలోకి పోలీసులు
  2. ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

బెంగళూరు, జనవరి ౨౪: కర్ణాటకలోని బళ్లారిలో ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డికి చెంది న రూ.3 కోట్ల విలువైన మోడల్ హౌస్‌కు శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. మంటల ను గమనించిన స్థానికులు హుటాహుటిన భవనం వద్దకు వచ్చారు. నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నించగా నిందితులు వారి నుంచి తప్పించుకుని పరారయ్యారు.

అనంతరం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలా నికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. జనార్దన్‌రెడ్డి పదేళ్ల క్రితం ఈ భవనం నిర్మించగా, ప్రస్తుతం అక్కడ ఎవరూ నివాసం ఉండటం లేదు. దీంతో ప్రాణనష్టమేమీ నమోదు కాలేదు. ఈ ఘటనపై గాలి జనార్దన్‌రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్ర అని ఆరోపించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి మద్దతుదారులే భవనానికి నిప్పుపెట్టారని పేర్కొన్నారు. ఈనెల 1న ఎమ్మెల్యే బృందం తమను బెదిరించారని, దీనిలో భాగంగానే తాజాగా తమ ఆస్తులకు నిప్పు పెట్టారని వ్యాఖ్యానించారు. గాలి జనార్దన్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి ఇదే రోజు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు యువకులు కాగా, ఆరుగురు మైనర్లు ఉన్నట్లు సమాచారం. తాము నిర్మానుష ప్రాంతలంలో రీల్స్ చేసేందుకు నిప్పు వెలిగించగా, అది కాస్త భవనానికి అంటుకు న్నాయని పోలీసులకు నిందితులు వాంగ్మూ లం ఇచ్చినట్లు తెలిసింది.