25-01-2026 12:05:06 AM
కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో పర్యాటకుల సందడి
శ్రీనగర్/ సిమ్లా: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీగా హిమపాతం కురుస్తున్నది. సిమ్లా, మనాలి, గుల్మార్గ్, సోనామార్గ్, డల్హౌ సీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. కశ్మీర్ లోయ లోని షోపియాన్, లోలాబ్ ప్రాంతాల్లో కురిసిన హిమపాతం కారణంగా ఏకంగా నాలు గు అడుగుల మేర మంచు పేరుకుంది.
హి మపాతం కారణంగా పర్వత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. హిమపాతం రవాణా వ్యవస్థను పూర్తిగా స్తం భింపజేసింది. శ్రీనగర్ -జమ్మూ జాతీ య రహదారిపై మంచు పేరుకుపోవడంతో అక్క డి ప్రభుత్వం రాకపోకలు నిలిపివేసింది. మ రోవైపు శ్రీనగర్ విమానాశ్రయం నుంచి కొ న్ని విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి.