31-08-2025 12:56:20 AM
యూత్ కమిటీ ఆధ్వర్యంలో పూజలు
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాం తి): వరంగల్‌లోని ‘ం’ సిటీ బీరన్న దేవాలయంలో ప్రతిష్టించబడిన మహా గణపతికి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం బీరన్న దేవాలయ యూత్ కమిటీ ఆధ్వర్యం లో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఛాంబర్ కోశాధికారి అల్లే సంపత్ పాల్గొన్నారు. పూజ అనంతరము బీరన్న దేవాలయ యూత్ కమిటీ వారిచే రక్తదాన శిబిరం నిర్వహించి, రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఛాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. యువత సామాజిక స్పృహ, సేవ రంగాలలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.