calender_icon.png 31 August, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ వారం వార్తల్లో..

31-08-2025 12:57:53 AM

‘చికిత’ లిఖించింది చరిత

కెనడాల బాణాల (వరల్డ్ ఆర్చరీ యూత్ చాంపియన్‌షిప్) పోటీలు జరుగుతున్నయి. తెలంగాణ శిన్నది తానిపర్తి చికిత ఫైనల్ పోరుల బంగారు పతకంతో మెరిశింది. అదేంది బంగారు పతకం తెత్తే కనీసం వార్తలల్ల కూడా కనవల్లే అనుకుంట ర్ర.. ఏ క్రికెట్టో, టెన్నిసో అయితే చికిత పేరు మారుమోగేదే.. ఎవలు గుర్తించినా గుర్తించకున్నా చికిత చరిత లిఖించింది. 

రాజ్‌నాథ్‌తో  ‘రాజీ’నే మేలు.. 

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాజ్‌నాథ్ మంత్రిగా బా ధ్యతలు చేపట్టిన తర్వాత మన సైనిక శక్తి పెరిగింది. విదేశాల ఆటలు బంద్ అయ్యాయి. సింగ్ సాబ్ అండతో మన త్రివిధ దళాలు శక్తికి మించి పోరాడుతున్నాయి. బయటి దేశాలకు రాజీ తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది.