01-09-2025 07:31:03 PM
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పూజా కార్యక్రమాలకు సేవలను కెనడా ప్రధాని మార్క్ కార్ని లేక ద్వారా అభినందించారు. కెనడా రాజధాని ఓట్టాయా నగరంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహుని కళ్యాణ వేడుకలకు కెనడా దేశ ప్రధాని మార్క్ కార్ని పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతులతో ఆలయ ఈవో ఎస్.వెంకట్రావు, ఆలయ ఏఈవో గజవెల్లి రఘు కలిసి రిటైర్డ్ ఆలయ ప్రధాన అర్చకులు నల్లన్దిగల్ నరసింహాచార్యులుచే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఇట్టి కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచారకులు మాజీ ఎంపీ ఆర్య చంద్ర, పాపల కరుణాకర్ రెడ్డి, తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్యం ప్రత్యేక అతిథులుగా కార్యక్రమంలో పాల్గొన్నారు. కెనడాలో నివసిస్తున్న భారతీయులందరూ శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించి తన్వయత్వం చెందారు. స్వామి వారి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనడం జన్మ ధన్యం అయిందని ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించాలని వారు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో కెనడా పౌరులు, భారతీయులు పాల్గొని ఒట్టాయా నగరంలో ఒక కొత్త భక్తి ప్రపంచాన్ని వారు ఏర్పాటు చేశారన్నట్టుగా అక్కడ కనబడుతుంది. భారతీయ సాంప్రదాయాలు చాలా బాగున్నాయని పూజా కార్యక్రమంలో పాల్గొనడం వలన కొత్త అనుభూతి చెందని అక్కడి ప్రజలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విదేశాలలో నిర్వహించడం వలన భక్తి భావాన్ని ప్రపంచం మొత్తం పంచినట్టుగా ఉందని తెలుగువారు తెలిపారు. ముందు ముందు మరిన్ని మరిన్ని అంతర్జాతీయ నగరాలలో స్వామి వారి కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కెనడాలో నివసిస్తున్న భారతీయులు కూడా జరిగింది.