calender_icon.png 7 July, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక నేత కాల్వ నర్సయ్య యాదవ్ ఆశయ సాధనకి ఉద్యమిద్దాం

06-07-2025 06:59:39 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కార్మిక నేత ప్రజా ఉద్యమాల నాయకుడు కాల్వ నర్సయ్య ఆరవ వర్ధంతి సందర్బంగా సిపిఐ(CPI) జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి, కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ లు మాట్లాడుతూ... కాల్వ నరసయ్య యాదవ్  కార్మికుల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడని కరీంనగర్ నగరంలో హమాలీ కార్మికులను ఏకతాటిపై నడిపి వారి హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు నడిపి జైలు జీవితం గడిపిన చరిత్ర నరసయ్య యాదవ్ అని పేర్కొన్నారు.

కరీంనగర్ నియోజకవర్గంలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేసిన వ్యక్తి అన్నారు. కాల్వ నర్సయ్య యాదవ్ ఆశించిన ఆశయాల కోసం ప్రతి ఒక్క కమ్యూనిస్టు కార్యకర్త పని చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు జంగా తిరుపతి యాదవ్, జంగ కొమురయ్య యాదవ్ దానవేణి రమేష్ యాదవ్ గామినేని సత్తయ్య, నగునూరి  రమేష్, గోపాల సంపత్ యాదవ్, కుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.