09-09-2025 12:26:01 AM
భద్రాచలం, సెప్టెంబర్ 8, (విజయక్రాంతి)తొమ్మిది రోజులపాటు వినాయక నవరాత్రులు జ రుపుకొని భద్రాచలంలోని గోదావరిలో నిమజ్జనానికి వినాయక ప్రతిమలు వివిధ జిల్లాల నుండి వస్తూనే ఉన్నాయని రేపటి వరకు నిమజ్జన కార్యక్రమం పూర్తి అవుతుందని భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ట అన్నారు. సోమవారం భద్రాచలంలోని గోదావరి కరకట్ట ప్రదేశాలలో వినా యక నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పక్క జిల్లాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా భద్రాచలం గోదావరిలో వినాయక ప్రతిమలు నిమజ్జనం చేయడానికి రావడంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు , ఎన్‌డిఆర్ ఎఫ్ బృందం సహాయంతో భక్త మండల్ లకు ఇబ్బందులు కలగకుండా నిమజ్జనం చేయడం జరిగిందన్నారు.
20 అడుగుల పైన ఉన్న వినాయక ప్రతిమలను నిమజ్జనం చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సభ్యులకు సూచించారు. విగ్ర హాలను క్రేన్ సహాయంతో తీసేటప్పుడు భక్తులు గాని చూడడానికి వచ్చే ప్రజలు గాని ఎవరూ ఉండకూడదని చాలా జాగ్రత్తగా వారి వాహనాలలో నుంచి తీసి మెల్లగా గోదావరిలో నిమజ్జనం చేయాలని అన్నారు.
వినాయక భక్తమండలి సభ్యులు అధికారుల సూచనలను తప్పనిసరిగా పా టించి అతి భారీ వినాయక ప్రతిమలను సురక్షితంగా నిమజ్జనం చేసే విధంగా అధికారులకు స హకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, డి ప్యూటీ డిఎంహెచ్‌ఓ చైతన్య, ఇరిగేషన్ డిఇ మధు, ఏఈ వెంకటేశం, ఎన్ వి ఐ వెంకట పుల్లయ్య, జిపిఈఓ శ్రీనివాస్, ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.