calender_icon.png 11 September, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగని యూరియా తిప్పలు

11-09-2025 12:02:04 AM

-విక్రయ కేంద్రాల వద్ద రైతుల బారులు 

-టోకెన్లు ఇచ్చి పంపుతున్న అధికారులు 

-బస్తాలు దొరక్క అన్నదాతల రాస్తారోకోలు

మహబూబాబాద్/హనుమకొండ టౌన్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో రైతులకు యూరియా తిప్పలు తీరడం లేదు. విక్రయ కేంద్రాల వద్ద తెల్లవారుజామునుంచే బారులు తీరుతున్నా.. టోకెన్లు ఇచ్చి అధికారులు పంపుతున్నారు. దీంతో బస్తా లు దొరక్క అన్నదాతల రాస్తారోకోలు చేస్తున్నారు.

బుధవారం హనుమకొండ జిల్లా పరకాలలో టోకెన్లు ఇచ్చిన అధికారులు యూరియా బస్తాలు ఇవ్వడం లేదని రైతులు నిరసన వ్యక్తం చేశారు. పరకాల మండలంలో యూరియా సొసైటీలకు వస్తున్నప్పటికీ రైతులకు ఇవ్వకుండా ఇబ్బం దులకు గురిచేస్తున్నా రని మహిళా రైతులు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు అక్కడికి చేరుకొని యూరి యా సక్రమంగా ఇప్పిస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింప చేశారు.

రాస్తారోకోతో హనుమకొండొోపరకాల జాతీయ రహదారిపై వాహనా ల రాకపోకలకు ఆటంకం కలిగింది. కాగా రైతులు యూరియా కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రాత్రిపూట రైతు వేదికల వద్దకు వచ్చి నిద్రించకూడదని, రైతుల కు జాప్యం లేకుండా రికార్డులు పరిశీలించి త్వరితగతిన తోకలు జారీచేసి యూరియా పంపిణీ చే యాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పరిధిలోని కొత్తగూడా మండలంలో ఎస్పీ విస్తృతంగా పర్యటించారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పి ప్రతా ప్, గూడూరు సిఐ సూర్య ప్రకాష్, ఎస్ ఐ రాజకుమార్ పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వానకాలం సీజన్లో ఇప్పటివరకు 25,800 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేయడం జరిగిందని, రానున్న రోజుల్లో అవసరమైన తెప్పించి రైతులకు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. జిల్లాలో యూరి యా పంపిణీ కార్యక్రమం పై బుధవారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

పోలీస్ పహారా మధ్య..

నిర్మల్(విజయక్రాంతి)/ఇబ్రహీంపట్నం: నిర్మల్ జిల్లాలో యూరియా కోసం రైతులు బుధవారం బారులు తీరారు. లోకేశ్వరం, కడెం, ఖానాపూర్‌లో సహకార కేంద్రాల వద్ద రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి యూరి యా బ్యాగుల కోసం కోసం నిరీక్షించారు. ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క బ్యాగును పోలీస్ బందోబస్తు మధ్య పంపిణీ చేశారు.

రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రం లో పీఎసీఎస్ కార్యాలయం వద్ద రైతులు బుధవారం తెల్లవారుజాము నుంచే యూరి యా కోసం బారులు తీరారు. అయినా బస్తాలు దొరకకపోవడంతో రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాట్లు వేసి నెలలు కావస్తున్నా యూరియా దొరక్కపోవడంతో సాగు చేసిన పంట ఎదుగుదలకు రాకుండా అక్కడే నిలిచిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

భద్రాద్రి కొత్తగూడెం(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడం లేదంటూ ఆరోపిస్తూ సహకార సంఘం కార్యాలయం ఎదుట ప్రధాన రోడ్డుపై రైతులు బైఠాయించారు. దీంతో కొత్తగూడెం భద్రాచలం ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్య నెలకొంది.

సుమారు 30 నిమిషాల పాటు రైతులు రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఒక పుస్తకానికి  ఒక యూరియా కట్ట మాత్రమే ఇస్తున్నారని, అది పంట పొలాలకు ఎటు సరిపోవటం లేదంటూ ఆందోళన చేశారు. పోలీసులు రంగ ప్రవేశమై రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.