calender_icon.png 11 September, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం రైతులు అధైర్యపడొదు

09-09-2025 12:23:52 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

సూర్యాపేట సెప్టెంబర్ 8 (విజయక్రాంతి) :  జిల్లాలోనీ రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కావున ఎవరు అధైర్య పడవద్దని  జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సోమవారం నాటికి 640 మెట్రిక్ టన్నులలో 520 మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయని,ఇంకా  120 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

అలాగే నేడు అదనంగా 420 మెట్రిక్ టన్నుల యూరియా  అన్ని పిఎసిఎస్ మరియు డీలర్ కేంద్రాల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. దానితో కలుపుకొని మొత్తం 540 మెట్రిక్ టన్నుల యూరియా నిలువలు జిల్లాలో ఉంటాయని స్పష్టం చేశారు. రానున్న రెండు రోజుల్లో  జిల్లాకు మరో 860 మెట్రిక్ టన్నులు యూరియా సరఫరా అవుతున్నదని తెలిపారు. రైతులకు సకాలంలో యూరియా అందించే విధంగా ప్రభుత్వం తగు చర్యలు చేస్తున్నదని, అందువల్ల రైతులెవ్వరు ముందస్తుగా యూరియా  కొనుగోలు చేసి నిల్వ చేయకూడదని సూచించారు.