calender_icon.png 12 August, 2025 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర భద్రం.. తెలంగాణలో భారీ వర్షాలు

12-08-2025 02:45:36 PM

హైదరాబాద్: తెలంగాణలో రానున్న నాలుగు రోజుల్లో అతి భారీ వర్షాలు వాతావరణ శాఖ ప్రకటించింది.  రాష్ట్రంలోని(Telangana Rains) పలు జిల్లాల్లో మంగళవారం నాడు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కుమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ఉమ్మడి వరంగల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రేపు కొన్ని అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, హనుమకొండ, జనగామ, వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్, భూపాల పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో రేపు భారీ వర్షం పడనుంది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. నిన్న హైదరాబాద్ లోని పటాన్‌చెరు,ఆర్‌సిపురం, నార్సింగి, గోల్కొండ, రాజేంద్రనగర్, బండ్లగూడ జాగీర్, శివరాంపల్లి, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, చంద్రాయణగుట్ట, కాటేదాన్, బహదూర్‌గూడ వంటి ప్రాంతాలలో చెల్లాచెదురుగా వర్షాలు పడ్డాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్డపైకి నీళ్లు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.