calender_icon.png 12 August, 2025 | 5:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెస్ట్ హౌస్ ను క్యాంప్ ఆఫీస్ గా మార్చడం దురదృష్టకరం

12-08-2025 02:57:14 PM

  1. నిధులు మంజూరు చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వమే 
  2. మాజీమంత్రి  గుంత కండ్ల జగదీష్  రెడ్డి   

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి):  నల్గొండ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను మంత్రి సొంత క్యాంపు ఆఫీస్ గా మార్చడం దురదృష్టకరమని దానిని గెస్ట్ హౌస్ గానే ఉంచాలని మాజీమంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంత కండ్ల జగదీశ్ రెడ్డి(Guntakandla Jagadish Reddy) డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా కేంద్రానికి వీఐపీలు వచ్చినప్పుడు గెస్ట్ హౌస్ ను  ఉపయోగించుకుంటారని దానిని  మంత్రి క్యాంపు ఆఫీస్(Minister's Camp Office)  కోసం వాడుకోవద్దని మేము  6.25 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని తెలిపారు. ఏఎం ఆర్ పి లిఫ్ట్ కింద ఉన్న  d25, d26,d29 d31.39,40  డిస్ట్రిబ్యూటరి ల కింద జిల్లాలో  70 వెల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత మాదే అన్నారు. కోమటిరెడ్డి మంత్రి అయిన తర్వాత జిల్లాలో పొలాలు ఎండిపోతున్నాయని జిల్లా మంత్రులకు హెలికాఫ్టర్ల సోకు, ఆర్భాటాలు తప్ప రైతుల మీద ప్రేమ లేదని మండిపడ్డారు. ఒక వైపు బనకచర్లతో గోదావరి నీటిని ఆంధ్రకు కట్టబెట్టాలాని చూస్తున్నారని విమర్శించారు. గత సంవత్సరం కూడా ఇదే విధంగా  పంటలు ఎండబెట్టారని ఇప్పటికైనా  వెంటనే పూర్తిస్థాయిలో నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

క్షుద్రపూజలు అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని కోమటిరెడ్డికి మంత్రి వర్గంలో కొనసాగే అర్హత లేదన్నారు. ఈ సమావేశంలో  శాసన మండలి సభ్యులు ఎం సి కోటిరెడ్డి , నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి , రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిరా పంకజ్ యాదవ్, మాజీ ఆర్వో మాలే శరణ్య రెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, నల్గొండ మున్సిపల్ మాజీ ఫోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, కనగల్ తిప్పర్తి నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు.. అయితగోని యాదయ్య, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకటరెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.