12-08-2025 02:51:50 PM
రైతు నుండి పదివేల రూపాయలు ఫోన్ పే ద్వారా తీసుకున్న లంచం
.అడ్డంగా దొరికిపోయిన సర్వేయర్
పెద్దపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీ( ACB trap) అధికారులకు పట్టుబడింది. ఓ రైతు నుండి పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ మండల సర్వేయర్(Mandal surveyor) ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.ఓ రైతు ద్వారా ఫోన్ పే నుండి మండల సర్వేయర్ అకౌంట్ కు పదివేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయగా ఏసీబీ అధికారులు వలపన్నీ పట్టుకున్నారు.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో(Peddapalli Tahsildar Office) పని చేస్తున్న సర్వేయర్ పెండ్యాల సునీల్ ఫోన్ పే ద్వారా 10 వేలు లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల విచారణ ప్రారంభించారు.నాగార్జున రెడ్డి అనే రైతు భూమి సర్వే చేసి పంచానమా ఇవ్వడానికి 10 వేలు సర్వేయర్ సునీల్ డిమాండ్ చేయగా సదరు రైతు ఏసీబీ అధికారులను సంప్రదించారు.ఏసీబీ అధికారుల సూచనల మేరకు సర్వే యర్ సునీల్ అకౌంట్ ఫోన్ పే ద్వారా 10000/-రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. ఏసీబీ అధికారులు పకడ్బందీగా పట్టుకున్నారు.