calender_icon.png 22 July, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోనారిలో గంగ నీళ్ల జాతర

22-07-2025 12:55:28 AM

వర్షాలు కురవాలని గ్రామదేవతలకు జలాభిషేకం

కుభీర్, జూలై 21 (విజయక్రాంతి): గత 15 రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో పంటలు వేసుకున్న రైతులు  ఎండు ముఖం పడుతుండడంతో రైతుల్లో గుబులు మొదలైంది. సోయా పత్తి మొలకలు ఎండల తీవ్రతకు తట్టుకోలేకపోతున్నాయి. దీంతో చేసేది ఏమీ లేక రైతులు ఆకాశం వైపు చూస్తూ దేవుని ప్రార్థిస్తున్నారు.

ఈ క్రమంలోనిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని సోనారి గ్రామస్తులు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో  బాసర గోదావరి నుండి గంగ నీళ్లను తెప్పించి  భాజా భజంంత్రిలతో శోభయాత్రగా తరలివెళ్లి  గ్రామంలోని గ్రామ దేవతలతో పాటు గ్రామంలోని, ఆంజనేయస్వామి  సాయిబాబా, దత్తాత్రేయ ఆలయా ల్లో గ్రామ పొలిమేరల్లో గల పాప హరేశ్వర ఆలయంలో దేవతల విగ్రహాలకు జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి వర్షాలు కురవాలని వేడుకున్నారు. వీడీసీ అధ్యక్షులు నాగభూషణం, గ్రామస్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.