17 April, 2026 | 10:13 AM

గ్యాస్ సిలిండర్ పేలి బొలెరో వాహనం దగ్ధం

02-06-2025 02:18 AM

ఫతేపూర్ మైసమ్మ మొక్కు తీర్చేందుకు వెళ్తున్న భక్తులు 

మహబూబ్ నగర్ జూన్ 1 (విజయ క్రాంతి) : ఫతేపూర్ మైసమ్మ దేవాలయంలో మొక్కు తీర్చుకునేందుకు వెళ్లిన ఒక కుటుంబ సభ్యులకు చేదు అనుభవం ఎదురైంది. ఫతేపూర్ సమీపంలో బొలెరో వాహనంలో సిలిండర్ తో పా టు తదితర సామాగ్రితో అమ్మవారి దర్శనానికి సమీపం లోని ప్రధాన రోడ్డుపై వాహనం ప్రయాణిస్తున్న సమయంలో సిలిండర్ పేలి ఒక్కసారిగా మంట లు వ్యాపించాయి.

హుటాహుటిన వాహనంలో ఉన్న వ్యక్తులు కిందికి దిగినట్లు స్థానికులు తెలిపారు. నారాయణపేట జిల్లాలోని కోస్గి మం డలం ముసిరిఫా గ్రామానికి చెందిన వ్యక్తులుగా స్థానికులు చెప్పారు.  ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం కాకపోవడంతో ఇలాంటి ప్రాణాలు నష్టం జరగలేదు. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.