గాయత్రి ఆసుపత్రిని వెంటనే సీజ్ చేయాలి
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 23 ( విజయక్రాంతి ): పేద ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న గాయత్రి ప్రైవేట్ ఆసుపత్రిని వెంటనే సీజ్ చేయాలని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న డిమాండ్ చేశారు. గురువారం కెవిపిఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో నిరసన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాయత్రి హాస్పిటల్లో వైద్య సేవల్లో తీవ్ర నిర్లక్ష్యం, దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.
మరణించిన వ్యక్తికి కూడా చికిత్స అందించినట్టు చెప్పి వేల రూపాయలు వసూలు చేశారని విమర్శించారు. రోగులను కోమాలో ఉన్నారని రోగి బంధువులను మభ్యపెట్టి అధిక ఫీజులు, టెస్టులు, స్కానింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.అలాంటి ఆసుపత్రిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకుని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గుంపల్లి అశోక్, నాగరాజ్, వెంకటయ్య, అంజిబాబు, రాములు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.






