28-01-2026 12:00:00 AM
బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్
మహబూబ్ నగర్, జనవరి 27 (విజయక్రాంతి): కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో జనరల్ స్థానాలలో బీసీలు పోటీ చేసి గెలవాలని, జనరల్ స్థానాలంటే బీసీలవే అని 50 నుంచి 60 శాతం ఉన్న బీసీల ఓట్లతోనే మన ఓట్లు మనకే వేసుకొని జనరల్ స్థానాలు కైవసం చేసుకోవాలని అని బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్ అన్నారు. మంగళవారం బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పాలమూర్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనరల్ 14 డివిజన్లో బీసీలు పోటీలో ఉండాలని, అక్కడ బీసీలే నిర్ణయాత్మక శక్తులుగా ఉంటారు కాబట్టి గెలుపు సునాయసమన్నారు.
జనరల్ స్థానాలు అంటే అగ్రవర్ణాల స్థానాలు కావని అవి బీసీలవే అని మహబూబ్ నగర్ తొలి కార్పొరేషన్ లో మెజారిటీ సభ్యులు బీసీ లు ఉండి అభివృద్ధిలో కీలకంగా ఉంటూ భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా బీసీలు అందరూ ఐకమత్యంతో ముందుకెళ్లి రాజ్యాధికారాన్ని సాధించే దిశలో అందరూ భాగస్వాములు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ గౌరవాధ్యక్షులు శివార్చక విజయ్ కుమార్, బీసీ జేఏసీ రైట్స్ రాష్ట్ర కన్వీనర్ సారంగి లక్ష్మీకాంత్, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న,తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివన్న తదితరులు పాల్గొన్నారు.