28-01-2026 12:00:00 AM
మేడ్చల్, జనవరి 27 (విజయక్రాంతి): మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మె ల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మధ్య మరోసారి క్రెడిట్ వార్ జరిగింది. మల్కాజిగిరి నియోజకవర్గంలో రైల్వే వంతనలు తమ వల్లే అంటే తమ వల్లే మంజూరయ్యాయని ఇద్ద రు వాదించుకున్నారు. మంగళవారం మల్కాజిగిరి నియోజకవర్గంలో వాజిపేయి నగర్‌లో అండర్ పాస్, సఫిల్ గూడాలో సబ్‌వే పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేరెడ్‌మెట్‌లో ఏర్పాటు చేసిన వేదిక మీదకు ఎంపీ ఈటల రాజేందర్ చేరుకోగానే బీఆర్‌ఎస్ కార్యకర్తలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.
పోటీగా బీజేపీ కార్యకర్తలు భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. తన పో రాటం, వినతి వల్లే రైల్వే పనులు మంజూరయ్యాయని చెప్పడంతో బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘నీకు సబ్జెక్టు తెలవదు కూర్చో’ అని ఓ బీజేపీ కార్యకర్తను ఉద్దే శించి ఎమ్మెల్యే వ్యాఖ్యానించగా బీజేపీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో నినాదాలు చేయడం తో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘రాజశేఖర్‌రెడ్డి నీవు తెలుసుకో’ అంటూ ఘాటు గా స్పందించారు.
రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా విడుదల చేయనందున కేంద్ర ప్రభుత్వమే మొత్తం వ్యయం భరిస్తోందన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో రైల్వే పనుల విషయమై సంబంధిత మంత్రిని కలిసి విన్నవించానని, పార్లమెంటులో ప్రస్తావించానని అన్నారు. కొంతమంది వీటి విషయమై సోష ల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిని తాను పట్టించుకోనన్నారు.
రైల్వే పనుల మంజూరు విషయమై ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మధ్య క్రెడిట్ వార్ జరగడం 15 రోజుల్లో రెండోసారి. మచ్చ బొల్లారం రైల్వే అండర్ పాస్ పనుల శంకుస్థాపన సందర్భంగా ఎం పీ, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరిగింది. రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్ప డింది. అలాంటి ఘటనే మళ్లీ జరిగింది.