calender_icon.png 4 November, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి..

04-11-2025 06:53:54 PM

జిల్లా పశు వైద్యాధికారి రామారావు..

తలమడుగు (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని ఆదిలాబాద్ జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ రామారావు పేర్కొన్నారు. మంగళవారం తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న పశువుల గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరన్ని ఆయన సందర్శించారు. అనంతరం పశు వైద్య కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తలమడుగు మండల పశు వైద్యాధికారి వైద్యులు లావణ్య, సాయి ప్రసాద్, గోపాలామిత్రాలు ఉన్నారు.