calender_icon.png 4 November, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేయాలి

04-11-2025 07:02:49 PM

ఏపీడి విజయలక్ష్మి..

సదాశివనగర్ (విజయక్రాంతి): ప్రతి గ్రామంలో నిరక్షరాస్యత నిర్మూలనకు ప్రతి ఒక్కరూ మహిళ కృషి చేయాలని జిల్లా అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో వయోజనపై మహిళా సమాఖ్య సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయలక్ష్మి మాట్లాడారు. ప్రతి గ్రామంలో మహిళా సంఘాల్లోని సభ్యురాలు అందరూ నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేసి సంఘ సభ్యులందరినీ అక్షరాసులుగా తీర్చిదిద్దాలని మహిళలను కోరారు. చదువుకోవడం వలన సమాజంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెరుగుతుందని, మహిళలకు సూచించారు.

అనంతరము ఐబీడీపీఎం నూకల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో మహిళా సంఘాల బలోపేతానికి అక్షరాస్యత ఎంతో అవసరమని మహిళలకు సూచించారు. మహిళలు చదువుకోవడం వలన స్వయం సహాయక సంఘాల్లో జరుగుతున్న ఆర్థిక లావాదేవీలను సులభంగా తెలుసుకోవచ్చని అన్నారు. ఏపీ ఎం ప్రసాద్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళ చదువుకొని ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు ఉపయోగించుకోవాలని మహిళలను కోరారు. మండల సమాఖ్య అధ్యక్షురాలు బాలన్ భాయ్ మాట్లాడుతూ  గ్రామస్థాయిలో మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు నుండి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి అభివృద్ధి దిశల ప్రయాణించాలని మహిళలను కోరారు. ఈ శిక్షణ కార్యక్రమంలో వయోజన విద్య జిల్లా అధికారులు వెంకటేశ్వర్లు, సీసీలు ఆంజనేయులు, రాజు, అకౌంటెంట్ రమేష్, వివో ఏలు, గ్రామ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.