04-11-2025 06:52:01 PM
కాటారం (విజయక్రాంతి): విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చల్ల దేవేందర్ రెడ్డి(36) వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. మంగళవారం ఇంటి ఆవరణలో విద్యుత్ మోటర్ రిపేరింగ్ చేస్తుండగా విద్యుఘాతానికి గురయ్యాడు. ఈ సంఘటనను గమనించిన వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే దేవేందర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దేవేందర్ మృతితో గంగారం గ్రామంలో విషాదం నెలకొంది. చేతికి అందివచ్చిన ఏకైక కొడుకు విద్యుత్ షాక్ తో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుగా మున్నీరుగా విలపించారు.