15 April, 2026 | 12:09 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి కృషి

04-11-2025 07:06 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలు  ఎదుర్కొంటున్న లో వోల్టేజ్ సమస్యలను  పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని, నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం తగిన స్థలాన్ని గుర్తించే దిశగా,  విద్యుత్ శాఖ అధికారులతో కలిసి కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి పలు ప్రాంతాలను పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుని, అధికారులకు  తక్షణ చర్యలు తీసుకోవాలని రవి  సూచించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ...  ప్రజలు విద్యుత్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఇంటికీ  విద్యుత్ సరఫరా అందించే లక్ష్యంతో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు ప్రతిపాదనను తెచ్చామని,అలాగే సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న విద్యుత్ అధికారులకు ఎఇ సత్యనారాయణ రెడ్డికి వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఇ సత్యనారాయణ రెడ్డి, లైన్ మెన్ భాస్కర్, కాంట్రాక్టర్లు, రాంగోపాల్ రావ్, శ్రీనివాస్ , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.