04-11-2025 06:58:26 PM
సదాశివనగర్ (విజయక్రాంతి): రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ గోదాంలో నిల్వ చేయాలని, గోదాంలను సద్వినియోగం చేసుకోవాలని, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేషన్ మేనేజ్‌మెంట్, రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో వేర్‌హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ చట్టం (WDRA Act) పై ఒక అవగాహన సమావేశం నిర్వహించబడింది. మంగళవారం మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి సింగిల్ విండో ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. చట్టం (WDRA Act) పై ఒక అవగాహన సమావేశం నిర్వహించబడింది.
మంగళవారం మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి సింగిల్ విండో ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ శ్యామ్‌కుమార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ లక్ష్మణ్, సెక్రటరీ భైరయ్య, డైరెక్టర్లు బక్కన్నగారి భాస్కర్, బత్తుల రాములు, ప్రవీణ్ రెడ్డి, ఉమామహేశ్వర్ రావు, కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ శ్యామ్‌కుమార్ మాట్లాడుతూ రైతులు తాము పండించిన పంటలకు సరైన ధర లభించని సమయంలో ప్రభుత్వ గోదాములను ఉపయోగించి నిల్వ చేయాలని సూచించారు.
గోదాముల్లో పంటలను నిల్వ చేస్తే రైతులకు వేర్‌హౌస్ రసీదు లభిస్తుంది. ఆ రసీదుతో రైతులు బ్యాంకుల నుండి రుణాలు పొందవచ్చు. తర్వాత మార్కెట్ ధర పెరిగినప్పుడు ఆ పంటలను అమ్మి రుణాలను సులభంగా చెల్లించవచ్చని తెలిపారు.ఈ విధానంతో రైతులు తమ ఉత్పత్తులకు ఉత్తమ ధరను పొందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ శ్యామ్‌కుమార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ లక్ష్మణ్, సెక్రటరీ భైరయ్య, డైరెక్టర్లు బక్కన్నగారి భాస్కర్, బత్తుల రాములు, ప్రవీణ్ రెడ్డి, ఉమామహేశ్వర్ రావు, కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.