04-11-2025 06:56:38 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని ఆంధ్ర బోర్ కు చెందిన బైక్ మెకానిక్ ఎర్రోజుల సత్యనారాయణ(50) అనే వ్యక్తి బాత్రూంలో కాలుజారిపడి మృతి చెందాడని ఎస్ఐ సురేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు గత నెల 30వ తారీఖున ఇంట్లో బాత్రూంలోకి వెళ్ళగా బాత్రూంలో బీపీ ఎక్కువ అయి కాలుజారి బాత్రూంలో పడిపోగా కుటుంబ సభ్యులు గమనించి లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి తలలో బ్లడ్ క్లాట్ అయిందని వైద్యం కోసం కరీంనగర్ రిఫర్ చేయగా కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ప్రతిమ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం చనిపోయాడన్నారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని అన్న ఎర్రోజుల శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఏఎస్సై సుధాకర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుందని తెలిపారు.