calender_icon.png 13 July, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిని చూడలేని.. కబోది గాదరి కిషోర్

12-07-2025 09:13:35 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేలుపై విమర్శలు చేయడం తగదు

నియోజకవర్గంలో 1400 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు

కెసిఆర్, కేటీఆర్ మెప్పు కొరకే కిషోర్ .. విమర్శలు

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి నియోజకవర్గంలో 1400 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు సాగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ,స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలుపై అసత్య ఆరోపణలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కళ్ళుండి అభివృద్ధి చూడలేని కబోది అని తుంగతుర్తి మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలగిరి మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కెసిఆర్, కేటీఆర్ మెప్పు కొరకే గాదరి కిషోర్ అభివృద్ధి జరుగుతున్న నేడు తప్పుడు మాటలు మాట్లాడడం అతని వివేకానికి నిదర్శనమని అన్నారు.

తుంగతుర్తి మండల కేంద్రంలో 45 కోట్ల నిధులతో 100 పడకల దవాఖాన అభివృద్ధి సాగుతున్నది. తిమ్మాపురం కోడూరు కొమ్మల సంఘం మీదుగా వెంకేపల్లి వరకు బ్రిడ్జితో సహా 32 కోట్లతో అభివృద్ధికి నిదర్శనం. గడిచిన 30 సంవత్సరాల కాలంలో ఏ ఎమ్మెల్యే చేలేని పనిని వెంబటిలో దళిత వీధుల్లో ఐటెన్షన్ వైర్లు మార్పించిన ఘనత మందుల సామేలు దక్కిందని అన్నారు. తుంగతుర్తి నుంచి రావులపల్లి ఎక్స్ రోడ్డు వరకు 13 కోట్ల నిధులతో నేడు రోడ్డు నిర్మాణ పనులకు కొనసాగుతున్నాయి.

నీవు ఎప్పటినుంచి గొట్టిపర్తికి పోయేటప్పుడు వెళ్లే రహదారి పనులు కనబడుట లేదని విమర్శించారు. ఉద్యమ నాయకుడు దళిత బిడ్డ దళిత ఎమ్మెల్యే మందుల సామేలుపై నీ విమర్శలు చదువుకున్న సంక నాకి పోయాయని అన్నారు. అక్రమ ఇసుక దోపిడీ, డబ్బు సంపాదన కొరకు ఏకంగా రైతులనే చంపిన చరిత్ర నీదని అన్నారు. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే పై అసత్యపు ఆరోపణలు చేస్తే నిన్ను రానున్న రోజుల్లో గ్రామాల్లో తిరగనియ్యమని ఘాటుగా హెచ్చరించారు. ఈనెల 14న తిరుమలగిరిలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి వెనకబడుతున్న తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం వస్తున్నారని ప్రత్యేక నిధులు రానున్నట్లు పేర్కొన్నారు.