calender_icon.png 13 July, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ జన జీవనానికి పాట ప్రాణం లాంటిది

12-07-2025 09:42:12 PM

కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సమస్త చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి

కామారెడ్డి,(విజయక్రాంతి): తెలంగాణ జన జీవితంలో పాట ప్రాణమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డిలో పాటకు సలాం పాటల రచన వర్క్ షాప్ కు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. పాటలు లేని తెలంగాణ ను ఊహించుకోవడం కష్టమని అన్నారు. ప్రతి మాటలో పనిలో పాట జన జీవితాన్ని అంటుకొని అంతర్లీనంగా జీవితాలను వినవేసి కొని ఉంటుందని అన్నారు. తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో యువతి యువకులను ప్రోత్సహించడానికి ప్రజా యుద్ధనౌక గద్దర్  యాదిలో నిర్వహించిన పాటకు సలాం పాటల రచన వర్క్ షాప్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.

పాటల ప్రాధాన్యతను గుర్తించి పాటల రచన వర్క్ షాప్ పెట్టడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ వర్క్ షాప్ ద్వారా ఎంతో మంది యువకులు పాటల ప్రాధాన్యతను తెలుసుకొని రచయితలుగా గాయకులుగా సమాజంలో రాణిస్తారని అన్నారు. తెరవే జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షకు మాట్లాడుతూ... యువకులను పాటలకు దగ్గర చేయడానికి సమాజాన్ని చైతన్యపరిచి మంచి మార్గంలో నడిపించడానికి పాటలు ఎంతో దోహదపడతాయని, యువకులకు శిక్షణ శిబిరంగా ఈ వర్క్ షాప్ ను నిర్వహించామని అన్నారు. ప్రముఖ సంగీత దర్శకులు గాయకులు, అష్టగంగాధర్ మాట్లాడుతూ ఎంతోమంది యువకులు నేడు పాటల రంగంలో రాణిస్తున్నారని అన్నారు. పాటల ఊటగా తెలంగాణ పాటకు సలాం చేస్తున్నదన్నారు. పాటలు రాయడంలో మెలకువలను సూచనలను వివరించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువకులు పాటల రచన వర్క్ షాప్ లో పాల్గొన్నారు. ఆలోచింపజేసే పాటలను పాడారు. కళాకారుల బృందం పాటలతో కార్యక్రమాన్ని అలరించింది. బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గజల్ కవి సూరారం శంకర్ , ఆల్లె మోహన్ రాజ్, శ్యామ్ కుమార్, మౌర్య జీవన్ కుమార్ , నాగభూషణం, కాశ నరసయ్య, కమలకాంత్, గంగా ప్రసాద్, సంధ్య, సావిత్రి, కళాకారులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ పాటల వర్క్ షాప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ విద్యార్థుల విభాగంలో రస్మిత  అక్షిత  సుజిత యువకుల విభాగంలో జీవన్ కుమార్, సంధ్య నరసయ్య బహుమతులను గెలుచుకున్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంస పత్రాలు మెమొంటోలను అందించడం జరిగింది.