12-07-2025 09:08:02 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో శనివారం మాతా శిశు సంరక్షణలో భాగంగా గర్భిణీ, బాలింత మహిళలకు పోషకహారాన్ని అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ... మహిళలు, బాలింతలు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తల గురించి వివరించారు. అసిస్టెంట్ గవర్నర్ ఎం. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ... మాతా శిశు సంరక్షణలో భాగంగా గర్భిణీ, బాలింత మహిళలకు పోషకాహారాన్ని అందించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తల్లి బిడ్డలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని ఈ పౌష్టిక ఆహారం వల్ల బిడ్డ ఎదుగుదల ఎంతో త్వరగా ఉంటుందని రోటరీ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మహిళా అభివృద్ధిలో భాగంగా ఇలాంటి పలు కార్యక్రమాలు ఎన్నో చేపడతామని పేర్కొన్నారు.