calender_icon.png 13 July, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ములుగు జిల్లాను సందర్శించిన రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్

12-07-2025 09:50:37 PM

జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష

ములుగు,(విజయక్రాంతి): ములుగు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఆరోగ్యము మరియు కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ ములుగు జిల్లాను సందర్శించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మరియు జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లతో వర్షాకాలంలో వచ్చే వ్యాధులు మరియు అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశ ఉద్దేశించి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ రవీందర్ నాయక్(Director of Health and Family Welfare Dr. Ravinder Naik) మాట్లాడుతూ... దోమలను లార్వా స్టేజీలోనే నిర్మూలించాలని ఆశా కార్యకర్తలకు ఆంటీ లార్వా నిర్మూలన చర్యల మీద అవగాహనను పెంపొందించాలని, ఇంటింటి సందర్శన ఆశా కార్యకర్తలు చేసేటట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న సూపర్వైజర్స్ పర్యవేక్షించాలని తెలిపారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, ఆరోగ్య విస్తారణ అధికారులు, సూపర్వైజర్స్ వారి వారి విధిని నిర్వర్తిస్తూ ఆరోగ్య కార్యకర్తలకు, ఆశా కార్యకర్తలకు సపోర్టింగ్ సూపర్విజన్ చేయాలని వివరించారు. ఆశా కార్యకర్తలు ఇంటింటి సందర్శించిన కావించినప్పుడు,నీటి నిల్వలు లేకుండా,నీటినిలువలపై మూతలు పెట్టుట,ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని,దోమతెరలు వాడాలని మొదలగు విషయాలపై ఇంటి యజమానులకు అవగాహనను కల్పించాలని తెలిపారు. మలేరియా- డెంగ్యూ వ్యాధులు నిర్ధారణ అయినప్పుడు, ఆ గ్రామాలలో గ్రామపంచాయతీ కార్యదర్శుల సమన్వయంతో ఫాగింగ్ను తప్పనిసరి చేయాలని, గ్రామాలలోనీ ఆర్ఎంపీ మరియు పీఎం పీస్ అర్హతకు మించి వైద్యము చేయకుండా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ను పాటించాలని తెలిపారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కీటక జనిత వ్యాధులపై ప్రజలకు అవగాహనను కలిగించాలని,మలేరియా డెంగు వ్యాధుల నియంత్రణలో భాగస్వాములు కావాలని కోరారు.