calender_icon.png 20 May, 2025 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం

20-05-2025 12:00:00 AM

  1. కలెక్టర్ అభిలాష అభినవ్

టెలిఫోన్ ప్రజావాణికి విశేష స్పందన

నిర్మల్ మే 19 (విజయక్రాంతి): ప్రజావా ణిలో వచ్చిన ప్రజల దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలని కలెక్టర్ అభిలా ష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలు మూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా ఆమె స్వీకరించారు. ఈ సం ద ర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, శాఖల వారీ గా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి తక్షణమే పరి ష్కరిం చాలని స్పష్టం చేశారు. పరిష్కార వివ రా లను దరఖాస్తుదారులకు అందించడంతో పాటు, సంబంధిత ఫైళ్లలో స్పష్టమైన రిమా ర్కులు చేర్చాలని ఆదేశించారు.

అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రారంభించిన టెలిఫోన్ ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని కలెక్టర్ తెలి పారు. ఫోన్ ద్వారా వచ్చిన అర్జీలను నమో దు చేసి, వాట్సాప్ ద్వారా రసీదు పంపే విధానాన్ని అమలు చేశారు. జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన దరఖాస్తుల పరిశీలనను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఈ నెలాఖరులోగా అర్హుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని, మండల ప్రత్యేకాధికారులు మండల స్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలన్నా రు. బడిబాట కార్యక్రమాన్ని పకడ్బం దీగా నిర్వహించడం, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చేరిక పెంచే చర్యలపై ప్రత్యేక దృష్టి సారిం చాలని కలెక్టర్ సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.