calender_icon.png 20 May, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘అహల్యాభాయ్’ను ఆదర్శంగా తీసుకుందాం

20-05-2025 12:00:00 AM

నిర్మల్ మే 19( విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి నివాస భవన్‌లో దేవి అహల్యాభాయ్ జయంతి వేడుకలను బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ ఆధ్వర్యంలో సోమవారం జరుపుకున్నారు. ఆమె చిత్రపటానికి పూల మాలవేసి సమాజ అభివృద్ధి కోసం మార్పు కోసం చేసిన సేవలను కొనియాడారు ఆయ న మాట్లాడుతూ..

మొగలుల కాలంలో ధ్వం సమైన హిందూ దేవాలయాలని పరిర క్షించడంలో రాణి అహల్యాభాయ్ హోల్కర్ పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు.  కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్,కార్యక్రమ జిల్లా కన్వీనర్ అలివేలు మంగ,

రాష్ట్ర నాయకురాలు ఆడే లలిత మహిళా మార్చే  జిల్లా అధ్యక్షులు రజిని, ముధోల్ కన్వీనర్ సుష్మా రెడ్డి, ఖానా పూర్ కన్వీనర్ సత్యవతి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అర్జున్, పట్టణ అధ్యక్షులు కార్తీక్, సుంకరి సాయి,తదితరులు పాల్గొన్నారు.