calender_icon.png 22 May, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పద స్థితిలో బాలింత మృతి

22-05-2025 12:00:00 AM

  1. అత్త, ఆడబిడ్డలే హత్య చేశారని మృతురాలి బంధువుల ఆరోపణ

ఇరువర్గాల తోపులాట.. పరిస్థితి ఉద్రిక్తం

ఆర్మూర్, మే 21 : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని వడ్డెర కాలనీలోని రెండు నెలల బాలింత అయిన మక్కల పూజ (27) అనుమానాస్పద స్థితిలో బుధవారం ఉదయం మృతి చెందింది. దీంతో ఆర్మూర్ లో ప్రక్కన ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  వివరాల్లోకి వెళితే.. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ రెండవ వార్డులో గల వడ్డెర కాలానికి చెందిన మక్కల పూజ (27) రెండు నెలల బాలింత అయిన మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది.

మృతురాలి భర్త మక్కల సాయిలు సుమారు మూడు నెలల క్రితం, మరిది ఇద్దరు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వలస వెళ్లారు. దీంతో వడ్డెర కాలనీలో అత్తమ్మ మక్కల నర్సుతో కలిసి రెండు నెలల బాలింత అయిన మక్కల పూజ నివాసముండేది. మంగళవారం రాత్రి అత్త నర్సుతో పూజతో గొడవ జరిగినట్లు సమాచారం. పూజ ఆడబిడ్డ గతంలో వివాహమై విడాకులు తీసుకున్నట్లు తెలిసింది.

ఆమె ఆడబిడ్డ వారి కాలనీలోనే అద్దెకు ఇల్లు తీసుకొని కిరాయికి ఉన్నట్లు సమా చారం. కాని బుధవారం ఉదయం ఆడబిడ్డ ఇంటికి వచ్చి ఉన్నట్లు కనపడిందని కాలనీవాసులు పలువురు చెబుతున్నారు. బాలింత అయిన పూజను అత్త నర్సు, ఆడబిడ్డ శైలజ ఇద్దరు కలిసి చంపివేసి ఉంటారని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ విషయంపై ఆర్మూర్ పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తే నిజానిజాలు బయట పడతాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.

మా అమ్మాయి పూజను అకారణంగా చంపివేశారని తొర్లికొండ కు చెందిన మృతురాలి బంధువులు ఆరోపణలు చేస్తూ అత్త, అడపడుచుపై దాడికి యత్నించారు. సమాచారం తెలుసుకున్న ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర రెడ్డి, ఎస్ హె ఓ సత్యనారాయణ గౌడ్ లు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

సంఘటన స్థలం వద్ద ఇరువర్గాల తోపులాటతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు వారిని చెదరగొట్టారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం అర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.