09-10-2025 12:00:00 AM
ఇదేనా వాహనం నడిపే తీరు?
(మహబూబాబాద్, విజయక్రాంతి); ముందు వెనకా చూసుకొని వాహనాన్ని నడపాలని చట్టం చెబుతోంది. అయితే ఇందుకు విరుద్ధంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నడిరోడ్డుపై బుధవారం ఓ వాహన డ్రైవర్ ముందు వెనక ఏమాత్రం చూసే పని లేకుండా ప్లాస్టిక్ పైపులను వాహనం పై పూర్తిగా కప్పేసి నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ తీసుకెళ్తున్న దృశ్యం ‘విజయక్రాంతి’ కెమెరాకు చిక్కింది. ఇంత నిర్లక్ష్యంగా వాహనాన్ని జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారిపై నడుపుతూ వెళ్తున్నప్పటికీ ఎక్కడ కూడా పోలీసులు ఆపి ప్రయత్నం చేయకపోవడం మరింత విడ్డూరం.
సామాన్యుడు హెల్మెట్ లేకుండా లేదంటే రెండు పక్కన పార్కింగ్ చేస్తే ఫోటోలు తీసి జరిమానాలు విధించే పోలీసులకు ఇంత నిర్లక్ష్యంగా నడిరోడ్డుపై అది జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారిపై వెళుతున్న పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ముందు వెనక పూర్తిగా ప్లాస్టిక్ పైపులతో అద్దాలను కప్పేసి యదేచ్ఛగా హారన్ మోగిస్తూ పట్టణ వీధుల్లో ప్రమాదకర పరిస్థితిలో పైపులతో వెళుతున్న వాహనంతో పలువురు వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనం కనిపించకుండా పైపులతో వెళుతుండడంతో ప్రతి ఒక్కరు వింతగా చూడాల్సి వచ్చింది.