calender_icon.png 1 August, 2025 | 5:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42% బీసీ కోట కోసం ఛలో ఢిల్లీ

31-07-2025 08:55:05 PM

బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు

దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

దేవరకొండ: కొండమల్లేపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ... లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ  ఇచ్చిన హామీ మేరకు, రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశామని, ఆ తీర్మానాన్ని గవర్నర్ రాష్ట్రపతికి పంపించారని ఇప్పుడు కేంద్రం బాధ్యతగా వ్యవహరించి వెంటనే ఆమోదించాలనీ వారు అన్నారు.

బలహీన వర్గాలపై నిజంగా ప్రేమ ఉంటే, కేంద్ర బీజేపీ ప్రభుత్వం 42% రిజర్వేషన్ బిల్లును తక్షణమే ఆమోదించాలి. ఈ బిల్లును ఆమోదించాలన్న డిమాండ్‌తో ముఖ్యమంత్రి రేవంత్ తో సహా  క్యాబినెట్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి ఢిల్లీకి వెళ్తున్నామని వారు తెలిపారు. ఆగస్టు 5, 6,7 తేదీల్లో ఢిల్లీ కేంద్రంగా అన్నిరకాలుగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నామని,42% బీసీ కోటా బిల్లుల ఆమోదంలో జరుగుతున్న జాప్యంపై నిరసన తెలిపేందుకు తొలుత 5న పార్లమెంట్ లో పార్టీ ఎంపీల ద్వారా వాయిదా తీర్మానం ఇవ్వబోతున్నాం.