calender_icon.png 1 August, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏరియాలో 62% బొగ్గు ఉత్పత్తి

31-07-2025 08:29:46 PM

ఏరియా జిఎం దేవేందర్

మందమర్రి,(విజయక్రాంతి): ఏరియాలోని భూగర్భ, ఉపరి తల గనుల్లో జులై మాసానికి గాను నిర్దేశించిన లక్ష్యంలో 62 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ జి.దేవేందర్ తెలిపారు. జియం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేకే 5 గనిలో 100% బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని, బొగ్గు ఉత్పత్తికి కృషి చేసిన కార్మికులను, సూపర్ వైజర్లను అధికారు లను ఆయన అభినందించారు.

భూగర్భ గనుల్లో  ఉద్యోగు ల  గైర్హాజరు మూలంగా బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగు తుందని అన్నారు. కార్మికుల హాజరు శాతం మెరుగు పరిచేందుకు అన్ని యూనియన్ నాయకులతో కలిసి చర్చించనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, అధికారులు, యూనియన్ నాయకుల సహాయ సహకారాలతో భూగర్భ గనుల్లో 100% ఉత్పతి సాధించడానికి కృషి చేస్తున్నామని వివరించారు. ఉద్యోగుల గైర్హాజరు శాతాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.