31-07-2025 08:59:19 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): కొత్తపల్లి మండలం చింతకుంటలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గురువారం రోజున జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పనులపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు గల కారణాలపై ఆరా తీశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఇంకా ఏమేమి పనులు పెండింగ్లో ఉన్నాయని వాకబు చేశారు.
పెండింగ్లో ఉన్న పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ సత్వరమే పూర్తి చేయాలనీ, డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లకు అన్ని హంగులు కల్పించి రెడీ చేయాలని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ లకు ఎక్కడా ఏమి అవసరం ఉన్నా వాటి పనులు చేపట్టాలనీ, ఇందులో ఉదాసీనంగా ఉండవద్దని అధికారులకు సూచించారు. ఇందుకు పనులకు సంబంధించిన ప్రతిపాదనలు తయారుచేసి అధికారులకు అందించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.