calender_icon.png 1 August, 2025 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పరిశీలన

31-07-2025 08:36:55 PM

సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను మండల స్పెషల్ ఆఫీసర్ జయశ్రీ పరిశీలించారు. గురువారం నారాయణపురం మండలం ఎంపీడీవో ప్రమోద్ కుమార్ తో కలిసి ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం ఎంపీడీవో ఆఫీసులో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరిగిన సహించేది లేదని అన్నారు.