31-07-2025 09:02:23 PM
ఎమ్మెల్యే మురళి నాయక్
మహబూబాబాద్,(విజయక్రాంతి): సంస్కృతికి నిదర్శనంగా తీజ్ వేడుకలు నిలుస్తాయని, ప్రకృతిని ఆరాధించే విధంగా గిరిజన మహిళలు ఈ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం బల్దియా పరిధిలోని సబ్ స్టేషన్ తండాలో నిర్వహించిన తీజ్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.