31-07-2025 08:33:30 PM
టేకులపల్లి,(విజయక్రాంతి): కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమం ఒక చెట్టు తల్లి పేరుతో (ఎక్ షేడ్ మాకే నామ్ పే) రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ &ప్లానింగ్) కే. వెంకటేశ్వర్లు నేతృత్వంలో టేకులపల్లి మండలం సింగరేణి కోయగూడెం ఓసీలోని డంప్ యార్డ్ వద్ద గురువారం మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యకమానికి ముఖ్య అతిధిగా చీఫ్ కాంసేర్వటార్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ బీమా నాయక్, డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ కిషన్ గౌడ్, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కోటేశ్వరరావు, పాల్వంచ ఎఫ్డిఓ కృష్ణమాచారి, కొత్తగూడెం జిఎం శాలెం రాజు, ఇల్లందు జీయం వీ.కృష్ణయ్య పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ &ప్లానింగ్) కే. వెంకటేశ్వర్లు, చీఫ్ కాంసేర్వటార్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ బీమా నాయక్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించవచ్చన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి సంస్థ ప్రతి ఏటా వేల ఎకరాల్లో మొక్కలు నాటుతుందని గుర్తు చేశారు.