calender_icon.png 24 August, 2025 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రికెట్ బ్యాట్ కోసమే బాలిక హత్య

24-08-2025 12:00:00 AM

  1. బాలుడిపై క్రైమ్ సినిమాల ప్రభావం
  2. ప్రణాళిక ప్రకారమే దొంగతనం
  3. దొరికిపోతాననే హత్య
  4. సహస్ర హత్య కేసు వివరాలు వెల్లడించిన సీపీ అవినాష్ 

కూకట్‌పల్లి/గచ్చిబౌలి, ఆగస్టు 23 (విజయక్రాంతి): కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 18న జరిగిన బాలిక హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశా రు. క్రికెట్ బ్యాట్ చోరీ కోసం వెళ్లిన బాలుడ్ని(14) దొంగతనం చేసేటప్పుడు సహస్ర చూసి, అరవడంతో విచక్షణారహితంగా కత్తి తో పొడిచి చంపేసి పారిపోయాడని పోలీసులు తెలిపారు. శనివారం సైబరాబాద్ కమిషనరేట్‌లో మీడియా సమావేశంలో సీపీ అవినాష్ మహంతి వివరాలు వెల్లడించారు.

నిందితుడైన బాలుడు (14), సహస్ర కుటుంబాలు పక్కపక్కన భవనాల్లో ఉంటున్నారు. సహస్ర సోదరుడు, నిందితుడు కలి సి క్రికెట్ ఆడుకునేవారు. సహస్ర సోదరుడి ఎంఆర్‌ఎఫ్ బ్యాట్‌ను నిందితుడు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో ఆ బ్యాట్‌ను ఎలాగైనా దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 18న సహస్ర ఇంట్లో అం దరూ బయటికి వెళ్లారని భావించిన నిందితుడు.. భవనం పైనుంచే గోడ దూకి సహస్ర ఇంట్లోకి వెళ్ళాడు.

ఆ సమయంలో సహస్ర టీవీ చూస్తూ ఉండటంతో వెనకాల నుంచి వెళ్లి వంట గదిలో ఉన్న బ్యాట్‌ను తీసుకొని బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా సహ స్ర చూసి, గట్టిగా అరిచింది. దొంగతనం బయటపడుతుందని భయపడిన బాలుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో సహస్రని విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుంచి గోడ దూకి వెళ్లిపోయాడు. పోలీసులు పలు రకాలుగా అనుమానితులను విచారించినా ఆధా రాలు దొరకలేదు.

సీసీ ఫుటేజీని పరిశీలించినా ఉదయం నుంచి ఇంట్లోకి ఎవరు వెళ్లి నట్లు కనిపించలేదు. ఈ సమయంలోనే భవనంలో ఉంటున్న వారిని, చుట్టుపక్కల వారి ని విచారించగా.. పక్క భవనంలో ఉంటున్న 14 సంవత్సరాల బాలుడు ఉదయం చాలాసేపు పక్క భవనం పైఅంతస్తులో ఉన్నట్లు తెలిసింది. దీంతో బాలుడ్ని అదుపులోకి విచారించడంతో అసలు విషయం బయటపడింది. నిందితుని ఇంట్లో సోదా చేసి హత్య కు వాడిన కత్తి, దొంగతనం ఎలా చేయాలని అతడు రాసుకున్న లెటర్, ఎంఆర్‌ఎఫ్ బ్యాట్‌ను స్వాధీనం చేసుకొని నిందితున్ని రిమాండ్‌కు తరలించారు. 

ఆర్థిక పరిస్థితులే కారణం!

బ్యాట్ కోసం హత్య చేయడం ఏమిటని పోలీసులు విచారించగా, నిందితుడి కుటుం బం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు తెలిసింది. తల్లితండ్రులను బ్యాట్ కొనివ్వాలని అడగం ఇష్టంలేక ఈ పని చేశానని నిందితుడు పోలీసుల ఎదుట చెప్పినట్టు సమాచారం. అయి తే ఎక్కువగా క్రైమ్ సినిమాలను ఓటిటిలో చూసే అలవాటున్న నిందితుడు పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లో సినిమాలు చూడటం, క్రికెట్ ఆడటం చేసేవాడు.

బ్యాట్ దొంగత నం ఎలా చేయాలి, ఎవరైనా అడ్డువస్తే వారి ని కత్తితో గాయపరిచి పారిపోవాలని ముం దుగానే ప్రణాళిక వేసుకున్నట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నాడని తెలిసింది. ఇలాం టి ఘటనలు పునరావృతం కాకుండా ఉం డాలంటే మైనర్లు, యువతీయువకుల పట్ల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు నిఘా ఉంచాలని, వారి ప్రవర్తన గుర్తిస్తూ తప్పుదారిలో వెళ్లకుండా చూసుకోవాలని సిపి తెలిపారు.

సహస్ర తల్లిదండ్రుల ఆందోళన

బ్యాట్ కోసమే వచ్చి తమ కుమార్తెను హత్య చేశాడని తెలియడంతో సహస్ర తల్లిదండ్రులు కృష్ణ, రేణుకతో పాటు వారి కుటుంబ సభ్యులు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట శనివారం ఆందోళన దిగారు. నిందితుడిని తక్షణమే కఠినంగా శిక్షించాలని, అప్పుడే తన కూతురు ఆత్మకు శాంతి కలుగుతుందని తల్లి రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. హత్య చేసిన నిందితుడిని సమాజంలో శిక్షిస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని, నా కూతురు లాంటి శిక్ష అతనికి విధించాలని కోరారు.

ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలని అన్నారు. కాగా సహస్ర తల్లితండ్రుల ను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పరామర్శించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టి మూడు ఆర్డర్స్ తీసుకొచ్చేందుకు తాను ప్రయత్నిస్తానని పాల్ తెలిపారు. 

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పరామర్శ

సహస్ర తల్లిదండ్రులను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వారి కు టుంబానికి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ చట్టం కూడా వర్తించే విధంగా చూడాలని డీసీపీని కోరినట్టు తెలిపారు. నిందితుడికి సహకరించిన వారి పై కేసు నమోదు చేసి జైలు శిక్ష పడేవిధంగా చూస్తామని చెప్పారు. సహస్ర కుటుంబాన్ని అన్ని విధాలుగా ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా ఆదుకుంటాం. అవసరమైతే వారికి డబుల్ బెడ్ రూమ్ కేటాయించడంతో పాటు ఉద్యోగం కూడా కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతామన్నారు.