calender_icon.png 24 August, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు

23-08-2025 11:41:57 PM

నర్మెట,(విజయక్రాంతి):  మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణు అధ్యక్షతన నో బ్యాగ్ డే సందర్భంగా శనివారం రోజున ప్రమాద రైతు సమాజం కోసం విద్యుత్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లైన్ ఇన్స్పెక్టర్ భూక్య బాలు నాయక్, పాల్గొని విద్యుత్ ఉపకేంద్రం సందర్శన చేయించి విద్యుత్ తయారి నుండి వినియోగం వరకు ఏ విధంగా పనిచేస్తుందో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు ముఖ్యంగా గణేష్ నవరాత్రి సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో మండపాలలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వారిలో సురక్ష విద్యుత్తు వాడకంపై చైతన్యం పెంచారు.