24-08-2025 12:00:00 AM
గ్రంథాలయ చైర్మన్ ఉపేందర్‌రెడ్డి
ఖైరతాబాద్;ఆగస్టు 23 (విజయక్రాంతి): దేశంలో ధూమారం రేపుతున్న ఓటు చోరీ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీ చేపడుతున్న 16 రోజుల పాదయాత్రకు మద్దతు తెలుపుతున్నామని తెలంగాణ గ్రంథాలయ చైర్మన్ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయ కులు వేణుగోపాలస్వామి తో కలిసి మాట్లాడారు.
రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అయిన ఓటు చోరీ విషయాన్ని బహిర్గతం చేసిన రాహుల్ గాంధీ దానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళుతున్నారని ఈ 16 రోజుల పాదయాత్రతో ఓటు చోరీపై యుద్ధం ప్రకటించారు అన్నారు. అందుకే జూబ్లీహిల్స్ వ్యాప్తంగా ఉన్న అన్ని డివిజన్లో తాము సైతం రాహుల్ గాంధీ పాదయాత్రకు మద్దతుగా పాదయాత్ర చేపట్టనున్నా మని, కృష్ణానగర్ లేబర్ అడ్డా నుండి మొదలయ్యే ఈ పాదయాత్రలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారు అని ప్రజలు సైతం ఓటు చోరీని వ్యతిరేకిస్తూ పాదయాత్రలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.