4 April, 2026 | 2:47 PM

Breaking News

గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •  

ప్రియుడి తల్లిపై ప్రియురాలి దాడి

10-02-2026 01:49 AM

కొడుకు ప్రియురాలిపై కేసు 

గరిడేపల్లి, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): కొడుకు వివాహేతర సంబంధం కన్నతల్లి ప్రాణాల మీదకు తెచ్చింది. సూర్యాపేట జిల్లా మండల కేంద్రమైన గరిడేపల్లిలో గుం డాల మిట్ట ప్రాంతానికి చెందిన కానుగు రాంబాబు అదే ప్రాంతానికి చెందిన మాధవి అనే మహిళతో వివాహేతర సంబంధం ఉన్నది. దీని కారణంగా తలెత్తిన వివాదంలో రాంబాబు తల్లిపై సోమవారం మాధవి కత్తి తో దాడి చేసింది.

రాంబాబు, మాధవిల మధ్య వివాహేతర సంబంధం విషయంలో రాంబాబు భార్య, మాధవితో జరిగిన గొడవలో రాంబాబు భార్యను మాధవి కొట్టింది. విషయం తెలుసుకున్న రాంబాబు తల్లి బక్క మ్మ మాధవిని అడిగేందుకు వెళ్లగా అక్కడ జరిగిన వివాదంలో మాధవి కత్తితో బక్కమ్మపై దాడి చేసి, గాయపరిచింది. బక్కమ్మ ను చికిత్స నిమిత్తం హైదరాబాదుకు తరలించినట్టు ఎస్సై చలికంటి నరేష్ వివరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.