calender_icon.png 7 July, 2025 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ క్రైమ్స్‌కు సమాధానం ఈ చిత్రం

07-07-2025 12:54:07 AM

ఆర్కే సాగర్ కమ్ బ్యాక్‌ఫిల్మ్ ‘ది 100’. ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో కేఆర్‌ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేశ్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం జూలై 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. “సైబర్ క్రైమ్ నేపథ్యంలో ఉన్న ఈ సినిమా సమాజానికి చాలా ముఖ్యం. ఈ ఏడాది బెస్ట్ ఫిలిమ్‌గా ‘ది 100’ వస్తుందని చెప్పడంలో డౌట్ లేదు” అన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. “సాగర్ నాకు చాలా ఏళ్లుగా పరిచయం. మా ప్రాంత వాసి. సొంతగా ఎదిగి ఇంత దూరం వచ్చాడు. ఇది ఒక ధైర్యాన్నిచ్చే సినిమా.

సమాజంలో జరుగుతున్న చాలా సమస్యలకు సమాధానం దొరికే సినిమా అవుతుందని ఆశిస్తున్నాం” అన్నారు. హీరో ఆర్కే సాగర్ మాట్లాడుతూ.. “ఈ సినిమా ఒక వెపన్. తప్పకుండా ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుడుతుంది. త్రేతాయుగంలో రామబాణం, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ‘ది 100’. ఇది రాసి పెట్టుకోండి. ఈ సినిమాకు అంత పవర్ ఉంది.

కమర్షియల్ మూవీ. వెరీ టచింగ్ పాయింట్. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా” అన్నారు. ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ.. “సొసైటీ మీద ఉన్న ప్రేమతో చేసిన సినిమా ఇది. ఇందులో ఉన్న మెసేజ్ అందరి గుండెలను తాకుతుంది” అన్నారు. డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ మాట్లాడుతూ.. “ఈ సినిమాను చాలా గ్రిప్పింగా, ఎక్సైటింగ్‌గా, ఎంగేజింగ్‌గా చెప్పాం.

ఇప్పటికే ఫిలిం ఫెస్టివల్స్‌లో ఈ సినిమాకు అవార్డులు వచ్చాయి. ఈ సినిమాలో అన్ని ఎలెమెంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా ఇది” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మిశా, రమేశ్ కరుటూరి, వెంకి పుషడపు, ఎస్ గోపాల్‌రెడ్డి, డైరెక్టర్లు బీ గోపాల్, ఏ కోదండరామిరెడ్డి, మూవీ యూనిట్ అంతా పాల్గొన్నారు.