28-01-2026 12:11:29 AM
ఆలేరు, జనవరి 27 : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధిని చూసి, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పార్టీలను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్టలో మంగళవారం ఆలేరు పట్టణంలోని ఒకటవ వార్డు కొలనుపాక రోడ్డుకు చెందిన కుంచం ఆంజనేయులు తో పాటు వివిధ రాజకీయ నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్న సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి దిశగా సాగుతున్న పాలనపై విశ్వాసంతోనే పార్టీలో చేరుతున్నారని తెలిపారు, అలాగే రానున్న మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుటకు అంకితభావంతో కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, ద్వారపు శంకర్, దోనకొండ కృష్ణ, ఎం.డి. పాషా, పూల సిద్దు, బొట్ల రాజేష్, కుంచెం అజయ్, యాదగిరి, పాకాల రాకేష్, చింటూ, శివ, మధు, భాను, కొంగ రాకేష్, తరుణ్ పాల్గొన్నారు.