21-09-2025 12:36:35 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి) : 1988లో రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ మండలం హనుమాన్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలో 27 మంది రైతుల కు 54 ఎకరాల భూమిని అప్పటి ప్రభు త్వం కేటాయించిందని, ధరణి వల్ల ఆ భూములపై తమ పట్టాలు కోల్పోయామని బాధిత రైతులు ఆవేదన వెలిబు చ్చారు. శనివారం ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను కలిసి తమ సమస్యను వివరించారు.
30 ఏళ్లుగా సేద్యం చేసుకుంటున్న భూములపై తమ కు పట్టాలు ఇప్పించాలని మంత్రి సీతక్కకు సదరు చెంచు రైతులు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి సీతక్క రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశా రు. భూ పంపిణీలో భాగంగా గత ప్రభుత్వాలు పేద చెంచు రైతులకు పంచిన భూములపై పట్టాలు మంజూరు చేయాలని ఆదేశించారు.