21-09-2025 12:36:36 AM
బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ
ముషీరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి) : భోలక్ పూర్ డివిజన్ ఎస్ బిఐ కాలనీలో చెట్లకొమ్మలు ఏపుగా పెరిగి విద్యుత్ తీగలకు తగులుతుండడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు శనివారం ఉధ్యానవన శాఖ, డీఆర్‌ఎఫ్ సిబ్బంది చెట్ల కొమ్మలు తొలగించారు. ఈ క్రమంలో పీ అండ్ టీ కాలనీకి చెందిన కాలనీ కార్యదర్శి డి. రామకృష్ణ (65) అటుగావెళ్తుండగా ప్రమాదవశా త్తు సిబ్బంది నరుకుతున్న భారీ చెట్టుకొమ్మ రామకృష్ణపై పడడంతో కుప్పకూలాడు.
రెండు కాళ్ళపై భారీ చెట్టుకొమ్మ పడడం వల్ల రెండు కాళ్ళు విరిగిపోవడంతో పాటు బలమైన దెబ్బలు తగిలాయి. నొప్పిని భరించ లేక కేకలు వేసినా రామకృష్ణ గమనించిన స్థానికులు వెంటనే చెట్టుకొమ్మను ఆయన పైనుంచి తొలగించి చికిత్స నిమిత్తం ఆర్టీసి క్రాస్ రోడ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బలమైన గాయాలుకావడం వల్ల రామకృ ష్ణను ఐసీయూలో ఉంచి వైద్యపరీక్షలు చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, పీ అండ్ టీ కాలనీ అధ్యక్షురాలు లత ఆసుపత్రికి వెళ్లి రామకృ ష్ణకు ధైర్యం చెప్పారు. అధికారులు చెట్ల కొమ్మలు కొట్టే సమయంలో ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే రామకృష్ణ రెండు కాళ్ళు కోల్పోయాడని బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ ఆరోపించారు.