calender_icon.png 16 November, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లోబల్ ఫ్లోరింగ్ సొల్యూషన్స్ ఎక్స్‌పో

16-11-2025 12:00:00 AM

  1. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 

దేశవ్యాప్తంగా 60కి పైగా ఎగ్జిబిటర్ల ఉత్పత్తుల ప్రదర్శన 

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 15 (విజయక్రాంతి): భారతదేశంలో తొలిసారిగా ఫ్లోరింగ్ సొల్యూషన్స్‌కు ప్రత్యేకంగా గ్లోబల్ ఫ్లోరింగ్ సొల్యుషన్స్  ఎగ్జిబిషన్ ‘జి ఫ్లోర్ ఎక్స్ పోనూవా2025’ పేరుతో నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో శనివారం నిర్వహించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా హైటెక్స్ బిజినెస్ హెడ్ టిజి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘జి ఫ్లోర్ ఎక్స్ పోనూ2025 వ్యాపార అవకాశాలకు వేదిక. ఈ ప్రదర్శన ఇన్నోవేషన్, నెట్వర్కింగ్, ఇండస్ట్రీ కలాబరేష్ప దృష్టి సారించిoదని ఆయన పేర్కొన్నారు.

వినోద్ శశిధరన్, గ్రూప్ హెడ్ - ఓన్ షోస్ హైటెక్స్ మాట్లాడుతూ.. ‘ఈ సమ్మిట్ ప్రతి ప్రాజెక్ట్ భాగస్వా మికి ఉపయోగకరమైన అవగాహన, అనుభవాలు అందిస్తుంది. నిర్మాణ సమాజంలో పరస్పర చర్చలు, పాఠాలు నేర్చుకునే అవకాశాన్ని ఇస్తుంది’ అన్నారు. కాగా ఫ్లోరింగ్ సొల్యూషన్స్‌కు ప్రత్యేకించిన తొలి   జి ఫ్లోర్ ఎక్స్ పో కమర్షియల్, రెసిడెన్షియల్, ఇన్స్టిట్యూషనల్ వంటి విభాగాలకు సంబంధిం చిన ఫ్లోరింగ్ శైలులు మొత్తం ఒకే వేదికపైకి తెచ్చింది.

ఈ మూడు రోజుల ఎగ్జిబిషన్‌లో దేశం నలుమూలల నుంచి వచ్చిన 60కి పైగా ఎగ్జిబిటర్లు ఆధునిక ఉత్పత్తులు, పదార్థాలు, సిస్టమ్స్, టెక్నాలజీలను ప్రదర్శిస్తున్నా రు. ఈవెంట్‌కు ఎమ్‌వైకే లాటిక్రేట్ ఇండి యా ప్రైవేట్ లిమిటెడ్ టైటిల్ స్పాన్సర్స్‌గా, ఓంమార్మో వరల్ కో -స్పాన్సర్స్‌గా, వాల్యూ ప్యాక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (వి- బాండ్) లాన్యార్డ్ పార్టనర్‌గా వ్యవహరిస్తున్నాయి. ఈ మూడు రోజుల ఎగ్జిబిషన్‌లో బిల్డర్లు, డెవలపర్లు, ఆర్కిటెక్టులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, ప్రోక్యూర్మెంట్ నిపుణులు సహా 5,000 మందికి పైగా ట్రేడ్ విజిటర్లు పాల్గొ నే అవకాశం ఉందని, ఈ నెల 16 వరకు కొనసాగుతుందని నిర్వహకులు తెలిపారు.