calender_icon.png 7 September, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.80వేలు పలికిన లడ్డూ

06-09-2025 09:44:53 PM

నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్‌ మండలంలోని చందుపట్ల గ్రామంలోని చారిత్రక వరసిద్ధి వినాయక ఆలయంలో నెలకొల్పిన గణపతి శోభాయాత్రను శనివారం వైభవంగా నిర్వహించారు. గణపతి వద్ద లడ్డూకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ లడ్డూను దక్కించుకోవడానికి ఎంతోమంది భక్తులు పోటీపడుతుంటారు. ఈ ఏడాది కూడా లడ్డూ వేలం పాట ఎంతో ఉత్కంఠగా కొనసాగింది. పానుగంటి మహేశ్వర్ రావు మనువడు ఇషాన్‌ రెడ్డి రూ.80వేలకు వేలంలో లడ్డూను దక్కించుకున్నారు.