calender_icon.png 5 September, 2025 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరి నది ఉధృతి పరిశీలన

04-09-2025 01:43:36 AM

గోదావరి ముంపు ప్రాంత ప్రజలకు ఎస్పీ డాక్టర్ శబరీష్ సూచన

మంగపేట,సెప్టెంబర్ 3 : ములుగు జిల్లా ఎస్పీడాక్టర్ శబరీష్ మంగపేట పోలీస్ స్టేషన్ ను బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్పీమాట్లాడుతూ వార్షిక తనిఖీలలో భాగంగా తనిఖీచేయడం జరిగింది పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ,రిసెప్షన్ సిబ్బందియొక్క పనితీరు,ఫిర్యాదు దారులతో మర్యాదగ వ్యవహరిస్తూ ఫిర్యాదును విచారణ అధికారికి అందించడంలో జాప్యం చేయకుండా కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

అదేవిధంగా పోలీసు స్టేషన్ రికార్డులను పరిశీలించి, ప్రతి వర్టికల్ కు ఒక అధికారిని కేటాయించి ఎప్పటికప్పుడు రికార్డులు పెండింగ్ లేకుండాపని పూర్తి చేయాలని ఆదేశించారు.అనంతరం గోదావరి నది పరివాహక ప్రాంతమైన  మంగపేట మండలంలోని కమలాపురంలోని ఇంటెక్ వెల్ వద్ద గోదావరి నది ఉధృతిని పరిశీలించారు. గోదావరి నదికి వరద పెరిగి ఉదృతంగా ప్రవహిస్తున్న తరుణంలో ముంపు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తనిఖీ నిర్వహణలో ఏటూరు నాగారం ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ ఐపీఎస్, ఏటూరునాగారం సిఐ శ్రీనివాస్,ఎస్ బి ఇన్స్పెక్టర్ శంకర్,మంగపేట ఎస్ ఐ టివిఆర్ సూరి పోలీస్ స్టేషన్ సిబ్బందిఉన్నారు.