04-09-2025 01:44:38 AM
మహబూబాబాద్, సెప్టెంబర్ 3 (విజయ క్రాంతి): శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా సేవా సంఘం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల శాఖ అధ్యక్షుడిగా చిన్యా తండాకు చెందిన జాటోత్ హరిచంద్ నాయక్ ఎన్నికయ్యారు. బుధవారం ఇనుగుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నూతన కమిటీని ఎన్నుకున్నట్లు హరిచంద్ తెలిపారు.
ఉపాధ్యక్షులుగా తేజావత్ సంతోష్, బానోతు సూర్యా నాయక్, భూక్యా ప్రభాకర్, గుగులోతు నరేందర్, గూగులోతు బీమా నాయక్, ప్రధాన కార్యదర్శిగా భానోత్ రాజు, కోశాధికారులుగా భానోత్ రామన్న, బానోత్ మోహన్, గౌరవ సలహాదారులుగా భూక్యా మిట్టు నాయక్, ఇస్లావత్ బాలు నాయక్, భూక్యా బాలాజీ, జాటోత్ రాంజీ నాయక్ తో పాటు 13 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు అధ్యక్షుడు హరిచంద్ తెలిపారు.